శాతకర్ణి ప్రీ రివ్యూ..!!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి నేపథ్యంలో రూపొందుతోన్న ఈ హిస్టారికల్ మూవీ ఫై నందమూరి అభిమానులతో పాటు , యావత్ సినీ లోకం కూడా ఆతృతగా ఎదురుచూస్తుంది.. రేపు ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నందమూరి అభిమానులు ఇప్పట్నుంచే థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు.. అయితే ఈ సినిమా ప్రీ రివ్యూ వచ్చేసింది.. ఈ చిత్ర ప్రీమియర్ షోను నారాలోకేష్, బ్రహ్మీణి దంపతులు అమరావతి లో చూడడం జరిగింది..

చూసిన ఆనందం లో తమ ట్విట్టర్ లో సినిమా విశేషాలను పంచుకున్నారు..దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని తీసాడని, బాలయ్య నటనతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని, చిత్రం లో ఇతరనటీనటులను కూడా తప్పకుండా మెచ్చుకోవాల్సిందే అని అన్నారు. మరో వైపు లోకేష్ భార్య నారా బ్రహ్మీణి కూడా ఈ చిత్రం పై తన స్పందనని తెలియజేసారు. ఈ చిత్రం చూశాక తనకు మాటలు రావడం లేదని దర్శకుడు క్రిష్ అద్భుతం తెరకెక్కించారని చెప్పింది. దీంతో వీరి మాటలు చూసిన అభిమానులు మరింత పండగా చేసుకుంటూ, సినిమా గ్యారెంటీ హిట్ అని స్వీట్స్ పంచుకుంటున్నారు. ఈ సినిమా నందమూరి అభిమానులనే కాక యావత్ తెలుగు సినిమా అభిమానులను విశేషంగా అలరించడం ఖాయం” అంటున్నారు.