శాతకర్ణి రిలీజ్ లో సరికొత్త ట్విస్ట్..!!

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రప్రంచానికి చాటి చెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియా జత కట్టగా, శాతకర్ణి తల్లిగా హేమ మాలిని కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్.ఇప్ప‌టికే రిలీజ్ అయిన శాత‌క‌ర్ణి టీజ‌ర్లు – ట్రైల‌ర్లు -ఆడియోకు అదిరిపోయే రెస్పాన్స్ రాగా శాత‌క‌ర్ణిపై అంచ‌నాలు రోజు రోజు కి పెరిగిపోతున్నాయి.. అభిమానులే కాదు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసిన కొంతమంది ప్రముఖులు కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవడం ఖాయం అంటున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ టైం లో కొన్ని హంగులు అద్దబోతున్నారు నిర్మాతలు.. ఇలాంటి చారిత్రాత్మక సినిమాల్లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు మ్యూజిక్ – రీ రికార్డింగ్ ఎంత బాగుండాలి బాహుబలి తో అందరికి తెలిసిందే. అయితే సతకర్ణిలో వచ్చే వార్ సీన్స్ లోని ప్రతి శబ్దం ఎంతో క్లియర్ గా వినిపించేలా రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 థియేటర్ల కు లేటెస్ట్ సౌండ్ టెక్నాలజీ డాల్మీ అట్మోస్ సిస్ట‌మ్‌ కి అప్ గ్రేడ్ చేస్తున్నారట.. ఈ సిస్ట‌మ్ ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో అమ‌ల్లో ఉంది. ఇండియా లో నార్త్ లో ఉన్న ఇక్కడ అంతగా లేదు.. ఈ సినిమాతో ఈ టెక్నాలజీ ని తెచ్చి మరో సరికొత్త రికార్డు సృష్టించనుంది శాతకర్ణి..