శాతకర్ణి శాటిలైట్ రైట్స్ అదుర్స్..!!

బాలకృష్ణ 100వ సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా విడుదలకి ముస్తాబవుతోంది.వైవిధ్యభరితమైన సినిమాలు తీసే క్రిష్ డైరెక్షన్ లో వచ్చే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు వున్నాయి. ఈ క్ర‌మంలోనే శాత‌క‌ర్ణి ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్‌లో జ‌రుగుతోంది. శాత‌క‌ర్ణి ప్రి రిలీజ్ బిజినెస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.60 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ‌లోనే శాత‌క‌ర్ణి ప్రి రిలీజ్ బిజినెస్ రూ.40 కోట్ల‌ను దాటేసిన‌ట్టు తెలుస్తోంది.

బాల‌య్య కేరీర్‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కు హ‌య్య‌స్ట్ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా లెజెండ్ నిలిచింది.మ‌రి ఇప్పుడు శాత‌క‌ర్ణి బిజినెస్ బాల‌య్య కేరీర్‌లోనే అత్య‌ధిక రేటుకు అమ్ముడ‌వుతూ రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 7 కోట్లకి కొనుగోలు చేశారని అంటున్నారు. ఆడియో వేడుక తరువాత ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెబుతున్నారు. సంక్రాంతికి భారీస్థాయిలో రానున్న ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనేది అభిమానుల మాట.