శ్రియ ఇద్దర్ని పడగొట్టేసిందిగా..!!

సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి.. హోరాహోరీగా నువ్వా నేనా అంటూ రెండు సినిమాలు విజయం కోసం పరితపిస్తున్నాయి.. బాలకృష్ణ 100  వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి పై ఎన్ని అంచనాలున్నాయి, చిరు 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 కూడా అంతే అంచనాలున్నాయి.. అయితే ఈ రెండు చిత్రాలకు ఓ కామన్ పాయింట్ ఉందని తెలుస్తుంది.. ఈ సంక్రాంతికి వచ్చి రికార్డ్ క్రియేట్ చేయబోయే ఈ రెండు చిత్రాలలో శ్రియ కనిపించబోతుంది..

శ్రియ బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో హీరోయిన్. చిరంజీవి ‘ఖైదీ నెం.150వ చిత్రంలోనూ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తోందని తెలుస్తుంది.. ఇందులో కాజల్ హీరోయిన్‌గా చేస్తున్నా, డ్యూయల్ రోల్ చేస్తున్న చిరంజీవితో శ్రియ కూడా స్ర్కీన్ షేర్ చేసుకుంటోందనేది టాక్. అదే నిజమయితే శ్రియ అరుదైన రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమన్నమాట. స్టార్ హీరోల ల్యాండ్‌మార్క్ మూవీల్లో హీరోయిన్‌గా చేసిన రికార్డ్ శ్రియ పేరు మీద టాలీవుడ్‌లో నిలచిపోనుంది.