మా టీవీ లో ఆత్రేయ హల్చల్ ఎప్పుడో..!!

Surya & Vikram Kumar's #24 World Television Premiere..Coming Soon On Maa TV .. #24PremiereOnMAA #HappyNewYear

Posted by Maa TV on Sunday, January 1, 2017

విలక్షణ నటనతో తమిళం తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సూర్య.. రీసెంట్ గా నటించిన చిత్రం 24. మనం దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతాకాదు..హీరోయిన్స్ గా సమంత, నిత్యామీనన్ లు అలరించగా, ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు..  టైం ట్రావెలింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మొదట్నుంచి ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీని పెంచింది..

సూర్య తొలిసారిగా మూడు డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం వెండితెరపై సంచలనం సృష్టించగా ఈ సినిమా బుల్లితెరపై ఎప్పుడెప్పుడొస్తుందా అని టీవీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. దానికి తగ్గట్లే మా టీవీ లో ఈ సినిమా త్వరలో ప్రసారం కానుందని ఇటీవలే ప్రకటించారు.. అయితే ఖచ్చితమైన డేట్ మాత్రం తెలుపలేదు..కానీ అభిమానులు ఈ సంక్రాంతి కి బులితెరపైన రాబోతున్న క్రేజీ ఫిలిం ఇదే అంటున్నారు.. అంటే సూర్య ఆత్రేయగా ఈ సంక్రాంతి కి హల్చల్ చేయనున్నాడన్నమాట..