నాకు నచ్చితే చాలు చేసేస్తా ..

గ్లామర్ పాత్రల్ని పోషించడం సులభమని భావిస్తారు. కానీ ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడం ఛాలెజింగ్‌గా ఉంటుంది. పాత్రలో నవ్యత కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది అని తెలిపింది తమన్నా. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ఒక్కడొచ్చాడు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ ప్రతి సినిమాలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలే దక్కాలంటే కుదరదు. మహిళా ప్రధాన కథాంశాలతో పోలిస్తే కమర్షియల్ సినిమాల్లో కథానాయికల పరిధి తక్కువే ఉంటుంది.

నిడివి పట్టింపులు నాకు లేవు. నచ్చితే చాలు ఎలాంటి పాత్ర అయినా చేసేస్తా.. నేను ఆ సినిమాలో భాగమైతే చాలనుకుంటాను. పునర్జన్మలను నేను నమ్మను. జీవితాన్ని సంతోషంగా గడపాలన్నదే నా సిద్ధాంతం. ఈ ఏడాది పుట్టిన రోజును స్నేహితుల మధ్య చాలా సింపుల్ జరుపుకున్నాను.హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా రకుల్, చరణ్‌తో పాటు ఇక్కడ ఉన్న స్నేహితులందరిని కలుస్తాను.ప్రస్తుతం క్వీన్ తమిళ రీమేక్‌ను అంగీకరించాను. దీనితోపాటు శింబుతో ఓ సినిమా చేస్తున్నాను. బాహుబలి తొలిభాగం తరహాలోనే రెండో భాగంలో నా పాత్ర శక్తివంతంగా సాగుతుంది అని తెలిపింది.