తాప్సి కి మరో అవకాశం..!!

సొట్టబుగ్గల తాప్సి తెలుగులో కనపడి చాల రోజులే అయిపొయింది.. బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి అవకాశాలను రాబట్టిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తెలుగులో ఓ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.. అంతకుముందు టాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఆమె తెలుగులో ప్రస్తుతం బిజీ గా ఉంది.. ప్రస్తుతం రానాతో ‘ఘాజీ’, అక్షయ్ కుమార్ బేబీ సీక్వెల్ ‘నాం షబానా’ మూవీలతో బాలీవుడ్‌లో బిజీగా వుంది. అయితే.. టాలీవుడ్‌లో ఓ హారర్ కామెడీ మూవీతో మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతుందట తాప్సీ.

లేడీ ఓరియంటెడ్‌గా సాగే ఈ మూవీలో తాప్సీ కమెడియన్ శ్రీనివాస రెడ్డితో రొమాన్స్ చేస్తుందట. ‘గీతాంజలి’ మూవీలో హీరోయిన్ అంజలితో జతకట్టి హిట్ కొట్టాడు శ్రీనివాస రెడ్డి. రీసెంట్‌గా పూర్ణతో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంటూ మరో సక్సెస్ వచ్చింది ఈ కామెడీ హీరోకి. దాంతో ఇప్పుడు తాప్సీతో రొమాన్స్ చేసే ఆఫర్ వచ్చింది. అయితే.. స్క్రిప్ట్ నచ్చి శ్రీనివాస రెడ్డితో చేయడానికి ఓకే అనేసిందట తాప్సీ. త్వరలోనే ఈ మూవీ స్టార్ట్ కాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.