టీవీ లో ఇప్పుడంతా హారర్ ట్రెండే..!!

వెండితెరపైనే కాదు బుల్లితెరపైన కూడా ఇప్పుడు అంతా హారర్ ట్రెండే నడుస్తుంది.. నాగిని, నందిని, సప్తమాత్రిక, దేవయాని, మల్లీశ్వరి వంటి సీరియల్స్ ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించడమే ఇందుకు కారణం. ఈ స్ఫూర్తి తో ఇతర ఛానల్స్ సైతం మరి కొన్ని సీరియల్స్ ని ఇలానే రూపొందించి వీక్షకులను ఆకట్టుకుంటున్నారు.. సీరియల్స్ ని తెరకెక్కించడంలో ఒక్కో ఛానల్ ది ఒక్కో ప్రత్యేకత..

అయితే అన్ని ఒకే జానర్ లో వస్తున్న ఒక్కో స్టోరీ ఒక్కో విధం గా మలచి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలమవుతున్నారని చెప్పొచ్చు.. అంతే కాకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో ,ఒళ్ళు గగుర్పొడిచే సన్నీ వేషాలతో స్క్రీన్ ప్లే ని అల్లి, కథను మరింత రసవత్తరంగా నడిపిస్తూ ప్రేక్షకులను సీరియల్ ను రెగ్యూలర్ గా చూసేలా చేయడం వారికే చెందింది.. నార్మల్ సీరియల్స్ రేటింగ్స్ ని కొల్లగొడుతూ , ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ ఈ సీరియల్స్ టీవీ కెరీర్ లోనే లేనటువంటి టాప్ రేటింగ్స్ తో మంచి ప్రశంశలందుకుంటుంది..