చిరు, బాలయ్యల పై వెంకీ సంచలన కామెంట్స్..!!

ఈ సంక్రాంతికి నువ్వా నేనా అంటూ చిరు బాలయ్య లు తమ సినిమాలు ఖైదీ నెంబర్ 150 , గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలతో వస్తున్నారు..ఇప్పటికే ఆయా హీరోల అభిమానులు మా సినిమా హిట్ అంటే మా సినిమా హిట్ అంటూ తెగ సంబరాలు చేసేసుకుంటున్నారు.. అయితే తాజాగా వెంకటేష్ ఈ ఇద్దరి హీరోల సినిమాలపై కామెంట్స్ చేసి మరో సంచలనానికి తెరతీశాడు.. బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, చిరు ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వాల‌ని ఈ సినిమాల హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు..

తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా సంక్రాంతి సినిమాల గురించి పోస్టు చేసిన వెంకటేష్ తన ఇద్దరు స్నేహితుల సినిమాలు చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ‘ఈ సంక్రాంతిని మనం మరింత సంతోషంతో, సంబరాలతో జరుపుకోవడానికి ఓ కారణం ఉంది. ఈ రెండు చిత్రబృందాలకు ఆల్‌ ది బెస్ట్‌. చిరు, బాలయ్యలను వెండితెరపై చూడటానికి ఇంకేమాత్రం ఆగలేను’ అని పేర్కొన్నారు. వెంకటేష్ ప్రస్తుతం గురు సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా జనవరి 26 న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందని సమాచారం..