ఆదివారం జీ ‘ కుటుంబం’ తో సందడి చేస్తుందట..!!

వినూత్నమైన షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న జీ తెలుగు అందిస్తున్న ప్రోగ్రాం ‘ జీ కుటుంబం అవార్డ్స్’.. ప్రదీప్, రవి, శ్యామల యాంకర్స్ గా చేస్తున్న ఈ షో ఈ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రసారం అవుతుందని జీ తెలుగు ప్రకటించింది..జీ తెలుగు  సీరియల్ లో వచ్చే  ఉత్తమ కుటుంబాలకి ఈ అవార్డ్స్ అందచేయటం ఈ షో ముఖ్య ఉద్దేశ్యం..

ఇలా అవార్డ్స్ అందించడం జీ తెలుగుకేం కొత్త కాదు.. 2015  గానూ ఈ అవార్డ్స్ ని ఇచ్చి ప్రేక్షకుల చే శభాష్ అనిపించుకున్న జీ తెలుగు మరో సారి ఈ అవార్డ్స్ ని ఇచ్చి అందరిని ఆకర్షించింది.. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎన్ని పనులున్నా ఆదివారం సాయంత్రం టీవీ ల ముందు వాలిపోండి..